The 'Great Mother' Who Locked Her Infant in a Scooty's Storage Compartment—A Heinous Act Driven by an Obsession with Reels.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం జనం ఎంతటి సాహసానికైనా, చివరికి ప్రాణాల మీదకు వచ్చే పనులకైనా వెనుకాడటం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో చూస్తే మానవత్వం ఎటు పోతోంది అనే సందేహం కలగక మానదు.
ఒక మహిళ తన చంటి బిడ్డను స్కూటీ స్టోరేజ్ బాక్స్‌లో పెట్టి లాక్ చేసిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఈ వీడియోలో, ఒక మహిళ తన పసిబిడ్డను స్కూటీ సీటు కింద ఉండే స్టోరేజ్ బాక్స్ (డిక్కీ)లో పడుకోబెట్టి, సీటు మూసివేసి దర్జాగా వాహనంపై వెళ్లడం కనిపిస్తుంది. కేవలం 17 సెకన్ల నిడివి గల ఈ వీడియో చూసి జనం విస్తుపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
అసలేం జరిగింది?:
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక మహిళ తన ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ వద్దకు బిడ్డను ఎత్తుకుని వచ్చింది. అంతవరకు సాధారణంగానే ఉన్నా, ఆ తర్వాత ఆమె చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేసింది. స్కూటీ సీటు తెరిచి, హెల్మెట్ లేదా సామాన్లు పెట్టుకునే డిక్కీలో పసిబిడ్డను పడుకోబెట్టింది. ఆపై ఏమాత్రం కనికరం లేకుండా సీటును బలంగా మూసివేసింది. అనంతరం ఏమీ ఎరుగనట్టు స్కూటీపై కూర్చుని వెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
సాధారణంగా స్కూటర్ డిక్కీలో గాలి ప్రసరణ అస్సలు ఉండదు. సీటు మూసివేసిన తర్వాత లోపల ఉన్న వ్యక్తికి ఊపిరి ఆడటం చాలా కష్టం. పైగా ఇంజిన్ పక్కనే ఉండటం వల్ల ఆ వేడికి పసిబిడ్డ తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. కేవలం ఒక రీల్ కోసం లేదా సరదా కోసం బిడ్డ ప్రాణాలను పణంగా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
In their quest for social media fame, people are hesitating at no risk—going to any lengths, even engaging in acts that jeopardize their very lives. A video that has recently surfaced inevitably raises the question: where is humanity headed?
Footage showing a woman placing her infant child inside a scooter's under-seat storage compartment and locking it is currently shaking up the internet. This shocking video, which has gone viral on social media, is currently sparking intense outrage among netizens. The incident reportedly took place in Madhya Pradesh. In the video, a woman is seen laying her infant down inside the storage box (dicky) located beneath the scooter's seat, closing the seat, and then riding away on the vehicle with apparent nonchalance. People are left aghast upon watching this video, which runs for a mere 17 seconds. Delving into the full details...
**What Exactly Happened?**
According to the viral video, a woman approached a scooter parked in front of her home while carrying an infant. While her actions appeared normal up to that point, what she did next left everyone in shock. She opened the scooter's seat and placed the infant inside the storage compartment—typically used for holding helmets or luggage. She then shut the seat forcefully, displaying absolutely no mercy. The video subsequently shows her sitting on the scooter and riding away, acting as if nothing out of the ordinary had occurred.
Typically, there is absolutely no air circulation inside a scooter's under-seat storage compartment. Once the seat is closed, it becomes extremely difficult for anyone trapped inside to breathe. Moreover, given the compartment's proximity to the engine, the heat generated could cause severe discomfort and distress to an infant. Widespread criticism is mounting over the act of putting a child's life at risk merely for the sake of a reel or for fun.
